చిత్రం: చంద్రముఖి (2005)
రచన : భువనచంద్ర
సంగీతం : విద్యాసాగర్
గానం : బిన్ని కృష్ణకుమార్
పల్లవి :
రారా (రారా) రారా (రారా)
రారా సరసకు రారా… రారా చెంతకు చేరా
ప్రాణమే నీదిరా… ఏలుకో రా దొరా
శ్వాసలో శ్వాసవై రారా
తోం తోం తోం… తోం తోం తోం
ఆఆ ఆ ఆఆ ఆ… దిననన దిననన దిననన దిననన
ఆఆ ఆ ఆ ఆఆ… దిననన దిననన దిననన
ఆఆ ఆ ఆఆ ఆ ఆఆఆ ఆఆ ఆ
చరణం : 1
నీ పొందు నే కోరి అభిసారికై నేను
వేచాను సుమనోహరా, ఆఆ ఆ
కాలాన మరుగైన ఆనంద రాగాలు వినిపించ నిలిచానురా
తననన ధీంత ధీంత ధీంత తన
తననన ధీంత ధీంత ధీంత తన
తననన ధీంత ధీంత ధీంత తన ధీంతనా
వయసు జాలమోపలేదుర
మరులుగొన్న చిన్నదాన్నిరా
తనువు బాధ తీర్చ రావేరా, రావేరా
సలసలసల రగిలిన పరువపు సొద ఇది
తడిపొడి వెడిపొడి తపనల స్వరమిది… రారా రారా
రారా (రారా) రారా (రారా) రారా (రారా)
రాజాధిరాజ రాజా గంభీర
రాజ మార్తాండ రాజ కులతిలక
వేంకటపతి రాజా పరాఖ్ పరాఖ్
లకలకలకలకలకలక, హా హ్హ హ్హ హ్హా
చరణం : 2
ఏ బంధమో ఇది ఏ బంధమో
ఏ జన్మబంధాల సుమగంధమో
ఏ స్వప్నమో ఇది ఏ స్వప్నమో
నయనాల నడయాడు తొలి స్వప్నమో
విరహపు వ్యధలను వినవా
ఈ తడబడు పెదవులు కనవా
మగువల మనసులు తెలిసి
నీ వలపును మరచుట సులువా
ఇది కనివిని ఎరుగని మనసుల కలయిక
సరసకు పిలిచితి… విరసము తగదిక
జిగిబిగి బిగిబిగి సొగసుల మొరవిని
మిలమిల మగసిరి… మెరుపుల మెరయగా
రారా రారా రా రా
లకలకలకలకలకలక
తాం తరికిట దీం తరికిట
తోం తరికిట నం తరికిట
తత్తతరికిట దిద్దితరికిట
తోంతోం తరికిట నంనం తరికిట
తా దీ తోం నం జంజం
తా దీ తోం నం జంజం
తకిట దికిట తొకిట నకిట
తక తకిట తక తిది తలాంగు తోం
తత్త తలాంగు తోం తక ది తలాంగు తోం
తలాంగు తక జం తదింత నకజుం
తలాంగు తక జం తదింత నకజుం
తలాంగు తక జం తదింత నకజుం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి