చిత్రం: ఆలాపన (1986)
సాహిత్యం: డా. సి.నారాయణ రెడ్డి
గానం: ఎ స్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
సంగీతం: ఇళయరాజా
కలిసె ప్రతిసంధ్యలో కలిగె పులకింతలొ (2)
నాట్యాలన్ని కరగాలి నీలొ నేనె మిగలాలి.. (2)
కలిసె ప్రతిసంధ్యలో పలికె ప్రతి అందెలొ
పొంగిపోదా సాగరాత్మ నింగికి.. చేరుకోదా చంద్ర హౄదయం నీటికి (2)
శౄష్టిలోన ఉంది ఈ బంధమే.. అల్లుకుంది అంతట అందమే..
తొణికే బిడియం తొలగాలి.. వణికే అధరం పిలవాలి ....
కలిసె ప్రతిసంధ్యలో పలికె ప్రతి అందెలొ
మేనితోనె ఆగుతాయి ముద్రలు. గుండెదాక సాగుతాయి ముద్దులు (2)
వింతతీపి కొంతగా పంచుకో.. వెన్నెలంత కళ్ళలో నింపుకో..
బ్రతుకే జతగా పారాలి.. పరువం తీరం చేరాలి ....
కలిసె ప్రతిసంధ్యలో పలికె ప్రతి అందెలొ
కలిసె ప్రతిసంధ్యలో పలికె ప్రతి అందెలొ
నాట్యాలెన్నొ ఎదగాలి నాలొ నేనె మిగలాలి.. (2)
కలిసె ప్రతిసంధ్యలో కలిగె పులకింతలొ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి