చిత్రం: ముద్ద మందారం (1981)
సంగీతం: రమేష్ నాయుడు
రచన: వేటూరి. సుందర రామ మూర్తి
గానం: జిత్ మోహన్ మిత్ర
పల్లవి :
షోలాపూర్...చెప్పులు పోయాయి... నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలొ పోయాయి అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకు పోయేవీ.. నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలొ పోయాయి అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకు పోయేవీ..
నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలొ పోయాయి
అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకు పోయేవీ..
నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలొ పోయాయి
చరణం: 1
అరె రమణ మూర్తి పెళ్ళి.. ఇది రాదు మళ్ళీ మళ్ళీ నవ్వాలి తుళ్ళి తుళ్ళి... అని పాడెను మళ్ళీ మళ్ళీ మన రమణ మూర్తి పెళ్ళి.. ఇది రాదు మళ్ళీ మళ్ళీ నవ్వాలి తుళ్ళి తుళ్ళి... అని పాడెను మళ్ళీ మళ్ళీ ఆ సందట్లొ కన్నేసి కనిపెట్టి కాజేసాడెవడో... నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలొ పోయాయి అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకు పోయేవీ.. నా షోలా..షోలా..షోలాపూర్ పెళ్ళిలొ చెప్పులు పోయాయి ఇది షోలాపూరు లెదరు..యాస్ లైట్ యాస్ ఫెదరు.. సూట్ యట్ ఎనీ వెదరు..నువు తొడిగి చూడు బ్రదరూ..
సూట్ యట్ ఎనీ వెదరు..నువు తొడిగి చూడు బ్రదరూ..
అని మురిపించి మరిపించి కొనిపించాడా కొట్టోడూ...
నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలొ పోయాయి
అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకు పోయేవీ..
చరణం: 2
జత నంబరేమొ ఆరు..ధర చూస్తె ఇరవయ్యారు... తొడిగాను ఒక్క మారు..వెళ్ళాను పాత వూరు
తొడిగాను ఒక్క మారు..వెళ్ళాను పాత వూరు ఒక సారైన పాలీషు కొట్టందె కొట్టేసాడెవడో.. నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలొ పోయాయి అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకు పోయేవీ.. నా షోలాపూర్ చెప్పులూ... పెళ్ళిలొ పోయాయి... దొరికితే... ఎవరైనా ఇవ్వండీ...హ హ హ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి