Premikula Roju లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Premikula Roju లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, జనవరి 2025, శనివారం

Premikula Roju : Dhaandiya Song Lyrics (దాండియా ఆటలు)

చిత్రం: ప్రేమికుల రోజు(2000)

సంగీతం: ఏ.ఆర్.రెహమాన్

సాహిత్యం: ఏ.ఎం రత్నం, శివగణేష్

గానం: ఎం.జి.శ్రీకుమార్, ఉన్ని మీనన్, కవితా కృష్ణమూర్తి


పల్లవి :

అతడు: దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ              గుజరాత్ పడుచులు ఆడ ప్రియుడే చెలికై చూడ             చెలి కనిపించేనా కనుచాటుగ నాకు             తన ప్రేమ చెప్పేనా ఈ నాడు             చెలి కనిపించేనా కనుచాటుగ నాకు             తన ప్రేమ చెప్పేనా ఈ నాడు             తన జాడేమిటో తెలియలేక నాకు             గుండెల్లో గుబులు పుట్టేనా             తన జాడేమిటో తెలియలేక నాకు             గుండెల్లో గుబులు పుట్టేనా             దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ             గుజరాత్ పడుచులు ఆడ ప్రియుడే చెలికై చూడ చరణం1:

అతడు:నిన్ను చూసి నన్ను నేను మరిచి             చెప్పలేదు మూగబోయి నిలిచి             మనసులోన దాగువున్న ఆ మాట తెలిసిందా ఆమె: నిన్ను చూసి నన్ను నేను మురిసి             అసలు మాట చెప్పకుండా దాచి             కళ్లతోటి సైగచేసి చెప్పాలే తెలిసిందా అతడు:ఓ..కాటుకల్లే నేను కనుల చేరుకుంటా             కాటుకల్లే నేను కనుల చేరుకుంటా             పూలవోలే విరిసీ నేను కురులనల్లుకుంటా ఆమె: ఓ..కళ్లలోన కాటుక కరిగిపోవునంట           కురులలోన పువ్వులన్నీ వాదిపోవునంట అతడు:నీ ప్రేమ హృదయమే పొందేనా             తాళిబొట్టు నీకు నే కట్టేనా ఆమె: ఈ మాట మాత్రమే నిజమైతే నా జన్మే ధన్యం అతడు:నా ప్రేమ నీవేలే ఆమె: నా ప్రేమ నీవేలే అతడు:నా ప్రేమ నీవేలే ఆమె: నా ప్రేమ నీవేలే .....

అతడు: దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ              గుజరాత్ పడుచులు ఆడ ప్రియుడే చెలికై చూడ             చెలి కనిపించేనా కనుచాటుగ నాకు             తన ప్రేమ చెప్పేనా ఈ నాడు             చెలి కనిపించేనా కనుచాటుగ నాకు             తన ప్రేమ చెప్పేనా ఈ నాడు             తన జాడేమిటో తెలియలేక నాకు             గుండెల్లో గుబులు పుట్టేనా             తన జాడేమిటో తెలియలేక నాకు             గుండెల్లో గుబులు పుట్టేనా

చరణం2:

ఆమె: ప్రేమ చూపులో ఉంది మహత్యం           ప్రేమ భాషలో ఉంది కవిత్వం          ప్రేమించుటలో ఉన్నది దైవత్వం దైవత్వం అతడు:ప్రేమ సృష్టికే మూలపురుషుడు             ప్రేమ జీవులకు పూజనీయుడు             ప్రేమలేనిదే ఏమౌనో ఈ లోకం భూలోకం ఆమె:ఓ .. నా మనసె నీలో దాచి ఉంచినాను ఆ మనసె క్షేమేనా తెలుసుకొనుట వచ్చాను అతడు:ఓ..నీ మనసు పదిలంగా దాచి ఉంచినాను             నాకంటే నీ మనసే నా పంచప్రాణాలు ఆమె:హృదయాలు రెండని అనలేవు ఇది నీదినాదని కనలేవు అతడు:ఈ మాటమత్రమే నిజమైతే నా జన్మే ధన్యం

ఆమె:నా ప్రేమ నీవేలే
అతడు:నా ప్రేమ నీవేలే
ఆమె:నా ప్రేమ నీవేలే
అతడు:నా ప్రేమ నీవేలే

యువతీ యువకుల కలయిక కోసం వచ్చెను నేడొక రాతిరి దాండియ అను ఒక రాతిరి యువతీ యువకుల కలయిక కోసం వచ్చెను నేడొక రాతిరి దాండియ అను ఒక రాతిరి మీకు తోడు మేముంటాము నేస్తమా జంకులేక ప్రేమించండి నేస్తమా మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి.. మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి..


Premikula Roju : Manasupadi Manasupadi Song Lyrics (మనసుపడి మనసుపడి)

చిత్రం: ప్రేమికుల రోజు(2000)

సంగీతం: ఏ.ఆర్.రెహమాన్

సాహిత్యం: ఏ.ఎం రత్నం, శివగణేష్

గానం: శ్రీనివాస్, ఎం. జి. శ్రీకుమార్


పల్లవి :

మనసుపడి మనసుపడి
మన్మథుడు మనసుపడి
మనసుపడి మనసుపడి
మన్మథుడు మనసుపడి
నీ కోసం పుట్టాడే
వరుడుగా వచ్చాడే
నీ కోసం పుట్టాడే
వరుడుగా వచ్చాడే
మనసుపడి మనసుపడి
మరుమల్లె మనసుపడి
నీ కోసం పుట్టెనులే
వధువుగా నిలిచెనులే
నీ కోసం పుట్టెనులే
వధువుగా నిలిచెనులే
నా గుండెలే ఆటస్థలముగా
ఎగిరెగిరి ఆటలు ఆడిన
చిన్నారివి నీవే తల్లి
కళ్యాణవేళ ముస్తాబయ్యి
పెళ్ళికొడుకుతో ముచ్చటలాడి
ఆనందమే జీవితమంటూ సాగు
గోరింటతో ముగ్గులు పెట్టీ
మణికట్టుకు గాజులు తొడిగి
ఈ రోజా చేతికి రోజా పువ్వందించూ
గోరింటతో ముగ్గులు పెట్టీ
మణికట్టుకు గాజులు తొడిగి
ఈ రోజా చేతికి రోజా పువ్వందించూ
నీ వరుడు రేపు వేంచేస్తాడు
తన ప్రేమ నీకు పంచిస్తాడు
నీ పెళ్ళి వేదికను నే వెయ్య
ఆ వరుడు చేయి నీ కందియ్య
నీ తండ్రి మది ఉయ్యాలలు ఊగా

చరణం 1 :

ఆ మనసులోని ప్రేమ
నీకు చెప్పలేదు
చెప్పబోవునంతలోనా
పెదవి మెదలలేదు
ఆ మనసులోని ప్రేమ
నీకు చెప్పలేదు
చెప్పబోవునంతలోనా
పెదవి మెదలలేదు
ఆదుకున్న దైవం ఆశ తీర్చ నేను
ఆశీస్సులు అందిస్తున్నా కంటనీరుతోను
నా కనులనిండుగా నీరూపం
నిను తలుచుకొనడమే నా ధ్యేయం
నా కనులనిండుగా నీరూపం
నిను తలుచుకొనడమే నా ధ్యేయం
నీ ఆనందమే నా సంతోషం
నా ప్రేమే ధన్యం
కలకాలం వర్ధిల్లు వర్ధిల్లు కలకాలం

మనసుపడి మనసుపడి
మన్మథుడు మనసుపడి
మనసుపడి మనసుపడి
మన్మథుడు మనసుపడి
నీ కోసం పుట్టాడే
వరుడుగా వచ్చాడే
నీ కోసం పుట్టాడే
వరుడుగా వచ్చాడే
మనసుపడి మనసుపడి
మరుమల్లె మనసుపడి
నీ కోసం పుట్టెనులే
వధువుగా నిలిచెనులే
నీ కోసం పుట్టెనులే
వధువుగా నిలిచెనులే

చరణం 2 :

కలువ కళ్ళకేమో కాటుకను తీర్చి
కారుమబ్బు కురులలోన
మొగలిపూలు పేర్చి
కలువ కళ్ళకేమో కాటుకను తీర్చి
కారుమబ్బు కురులలోన
మొగలిపూలు పేర్చి
విలువ కట్టలేని మణులు ఎన్నో దాల్చి
హంసలాగ వేదిక కొచ్చె చంద్రబింబ వదనం
మేలతాళం మ్రోగగా వధువునకు
తాళిబొట్టు కట్టేలే పెళ్ళికొడుకు
మేలతాళం మ్రోగగా వధువునకు
తాళిబొట్టు కట్టేలే పెళ్ళికొడుకు
ఈ పేద హృదయమే దీవించ
పూలజల్లే కురియూ వర్ధిల్లు కలకాలం


Premikula Roju : Roja Roja Song Lyrics (రోజా... రోజా...)

చిత్రం: ప్రేమికుల రోజు(2000)

సంగీతం: ఏ.ఆర్.రెహమాన్

సాహిత్యం: ఏ.ఎం రత్నం, శివగణేష్

గానం: పి. ఉన్నికృష్ణన్


పల్లవి :

రోజా... రోజా... రోజా రోజా రోజా రోజా...రోజా రోజా రోజా రోజా... రోజా రోజా రోజా రోజా...రోజా రోజా రోజా రోజా... నిన్ను చూసి నన్ను నేను.. మరచిపోయి తిరిగి వచ్చా.. నిను గాలిసోకగా వదలనులే.. నెలవంక తాకగా వదలనులే.. ఆ బ్రహ్మ చూసిన ఓర్వనులే.. నే ఓర్వనులే నే ఓర్వనులే.. రోజా రోజా...రోజా రోజా...

చరణం 1 :

కన్నులలో కొలువున్నావులే.. రాతిరిలో కనులకు కునుకే లేదులే.. వలువుగ నన్ను చుట్టుకోగా నీ సన్నని.. నడుముకు కలుగును గిలిగిలి నా రోజా.. నీ పేరు నా నోట నే చెప్పగా.. నా ఇంట రోజాలు పూచేనులే.. నీ జాడ ఒకరోజు లేకున్నచో.. నీ చెలియ ఏదంటూ అడిగేనులే.. నీ రాకే మరుక్షణం తెలుపును మేఘమే.. వానలో తడవగా నాకొచ్చునే జ్వరం.. ఎండలో నువు నడవ గా నాకు పట్టె స్వేదం.. తనువులే రెండు హృదయమే ఒకటి ...రోజా...రోజా...రోజా.. రోజా రోజా రోజా రోజా...రోజా రోజా రోజా రోజా... నిన్ను చూసి నన్ను నేను.. మరచిపోయి తిరిగి వచ్చా...

చరణం 2:

నవ యువతి నడుమొక గ్రంథము.. చదివైనా పలుచని రాత్రులు మంచులో.. దూరాలేలా జవరాలా బిడియాన్ని.. ఒకపరి విడిచిన మరి తప్పేముంది.. నన్నే నువ్వు తాకొద్దని.. గగనాన్ని ఆపేనా ఆ సాగరం.. నన్నే ముట్టుకోవద్దని.. చేతులకు చెప్పేనా ఆ వేణువు.. నీ స్పర్శే చంద్రుని మచ్చను మాపులే.. కనులలో జారెడు అందాల జలపాతమా.. నన్ను నువు చేరగా ఎందుకాలోచనా.. నీ తలపు తప్ప మరు ధ్యాసలేదు.. నా రోజా..రోజా..రోజా... రోజా రోజా రోజా రోజా...రోజా రోజా రోజా రోజా... నిన్ను చూసి నన్ను నేను.. మరచిపోయి తిరిగి వచ్చా.. రోజా రోజా రోజా రోజా...రోజా రోజా రోజా రోజా...

Premikula Roju : Prema Ane Song Lyrics (ప్రేమ అనే పరీక్ష రాసి)

చిత్రం: ప్రేమికుల రోజు(2000)

సంగీతం: ఏ.ఆర్.రెహమాన్

సాహిత్యం: ఏ.ఎం రత్నం, శివగణేష్

గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత


పల్లవి :

ప్రేమ అనే పరీక్ష రాసి… వేచి ఉన్నా విద్యార్ధిని ప్రేమ అనే పరీక్ష రాసి… వేచి ఉన్నా విద్యార్ధిని ప్రేమ అనే పరీక్ష రాసి… వేచి ఉన్నా విద్యార్ధిని ప్రేమ అనే పరీక్ష రాసి… వేచి ఉన్నా విద్యార్ధిని నీ మనసు పలకపైన… నా సంఖ్య చూసినపుడు నేనే నన్ను నమ్మలేదు… నా కనుల నమ్మలేదు నమ్ము నమ్మూ… నన్ను నమ్ము ప్రియుడా నాలో ప్రేమ… ఎపుడూ నీకే సొంతం డోలీ డోలీ డోలీ డోలీ… డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ… డోలీ డోలీ డోలీ డోలీ
చరణం 1 :
ఆఆ… ఈ చేతికి గాజులు నేనే కదా నేడు గాజులు తోడిగే… రోజే కదా ఈ చేతికి గాజులు… నేనే కదా నేడు గాజులు తోడిగే… రోజే కదా అహ..! గాజులు తొడగగ సుఖముందిలే ఆ సుఖమే లేని… మళ్ళీ మది కోరిందిలే ఇవి చెక్కిళ్ళా… పూల పరవళ్ళా ఈ చెక్కిలిపై నీ ఆనవాళ్ళా… అహ..! నిన్నటి దాకా నేనొక హల్లుని… నువ్వొచ్చాక అక్షరమైతిని ప్రేమ అనే పరీక్ష రాసి… వేచి ఉన్నా విద్యార్ధిని ప్రేమ అనే పరీక్ష రాసి… వేచి ఉన్నా విద్యార్ధిని డోలీ డోలీ డోలీ డోలీ… డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ… డోలీ డోలీ డోలీ డోలీ
చరణం 2 :
నీ ఒడిలో దొరికెను… సుఖం సుఖం ఆ సుఖమున కందిన… ముఖం ముఖం మనసిందుకు చేసెను… తపం తపం ఆనందమే ఇక… నేనేమై పోయినా అలుపెరుగదులే… ఏ ప్రేమలోనా అల లాగవులే… నీలిసంద్రానా ఇది జన్మజన్మలకు… వీడని బంధం విరహానికైనా… దొరకని బంధం ప్రేమ అనే పరీక్ష రాసి… వేచి ఉన్నా విద్యార్ధిని ప్రేమ అనే పరీక్ష రాసి… వేచి ఉన్నా విద్యార్ధిని డోలీ డోలీ డోలీ డోలీ… డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ… డోలీ డోలీ డోలీ డోలీ
డోలీ డోలీ డోలీ డోలీ… డోలీ డోలీ డోలీ డోలీ

Premikula Roju : Oh Maria Song Lyrics (ఓ మరియా ఓ మరియా)

చిత్రం: ప్రేమికుల రోజు(2000)

సంగీతం: ఏ.ఆర్.రెహమాన్

సాహిత్యం: ఏ.ఎం రత్నం, శివగణేష్

గానం: దేవన్, యుగేంద్రన్, ఫెబి మణి


పల్లవి :

ఓ మరియా ఓ మరియా
ఓ మరియా ఓ మరియా
ఫ్రూట్ చెలియా నా దునియా
ఈ మెయిలి లవ్ లెటర్ నీ దయా
లా లల లా లల లా లల లా లల లా
ఓ మరియా ఓ మరియా
ఓ మరియా ఓ మరియా
ఫ్రూట్ చెలియా నా దునియా
ఈ మెయిలి లవ్ లెటర్ నీ దయా
సాగరానికీ ఫిషింగ్ నెట్
ప్రేమించడానికీ ఇంటర్నెట్
దేశం నుంచి దేశం వీచే ప్రేమ వల
లా లల లా లల లా లల లా లల లా

చరణం 1 :

మౌనమనే ఒక తాళం చెవితో
మనసును మూయొద్దు
ప్రేమను జీవిత ఖైదిని చేసీ
జైలులో ఉంచొద్దు
హృదయాన్నే చలించీ పరిగెత్తిరా
మనకుంది నెట్ కేఫ్ వేగంగానురా
కంప్యూటర్ తో ప్రేమించే కాలం ఇది
ప్రేమ విత్తులే గాలిలో చల్లి
ప్రేమామయం చెయ్యాలి భూమి

ఓ మరియా ఓ మరియా
ఓ మరియా ఓ మరియా
ఓ మరియా ఓ మరియా
ఫ్రూట్ చెలియా నా దునియా
ఈ మెయిలి లవ్ లెటర్ నీ దయా
సాగరానికీ ఫిషింగ్ నెట్
ప్రేమించడానికీ ఇంటర్నెట్
దేశం నుంచి దేశం వీచే ప్రేమ వల

చరణం 2:

అందాలన్నీ పట్టిక వేసి
చూపును ఇంటర్నెట్
మనసును మీటి మౌసును తడితే
దొరుకును జూలియెట్
ఏ రెక్కలు లేకుండా ఎగిరెళ్ళుదాం
ఈ లోకాన్ని మైమరచి అట్లాడుదాం

ఓ మరియా ఓ మరియా
ఓ మరియా ఓ మరియా
ఫ్రూట్ చెలియా నా దునియా
ఈ మెయిలి లవ్ లెటర్ నీ దయా
సాగరానికీ ఫిషింగ్ నెట్
ప్రేమించడానికీ ఇంటర్నెట్
దేశం నుంచి దేశం వీచే ప్రేమ వల
ఓ మరియా ఓ మరియా
ఓ మరియా ఓ మరియా
ఓ మరియా ఓ మరియా
ఓ మరియా ఓ మరియా

30, అక్టోబర్ 2021, శనివారం

Premikula Roju : Vaalu Kannuladaana (వాలు కనులదాన)

చిత్రం: ప్రేమికుల రోజు(2000)

సంగీతం: ఏ.ఆర్.రెహమాన్

సాహిత్యం: ఏ.ఎం రత్నం, శివగణేష్

గానం: ఉన్ని మీనన్


పల్లవి :

వాలు కనులదాన వాలు కనులదానా నీ విలువ చెప్పుమైనా నా ప్రాణమిచ్చుకోన నీ రూపుచూసి శిలనుయైతినే ఓ... ఒక మాటరాక మూగబోతినే ఒక మాటరాక మూగబోతినే వాలు కనులదాన నీ విలువ చెప్పుమైనా నా ప్రాణమిచ్చుకోనా నీ రూపుచూసి శిలనుయైతినే ఓ... ఒక మాటరాక ... ఒక మాటరాక మూగబోతినే ఒక మాటరాక మూగబోతినే


చరణం 1 :

చెలియా నిన్నే తలచీ కనులా జధిలో తడిచీ రేయి నాకు కనుల కునుకు లేకుండా పోయింది నీ ధ్యాసే అయ్యింది తలపు మరిగి రేయి పెరిగి ఓళ్లంతా పొంగింది ఆహారం వద్దంది క్షణక్షణ మీ తలపుతో తనువు చిక్కిపోయేలే ప్రాణమిచ్చే ఓ ప్రణయమా నీకుసాటి ఏది ప్రియతమా మీటితే లోకాలు పలుక ఎల్లోరా శిల్పాలు ఒలక అజంతా సిగ్గులు ఒలక చిలకా మీటితే లోకాలు పలుక ఎల్లోరా శిల్పాలు ఒలక అజంతా సిగ్గులు ఒలక రోజే... నిను నేను చేరుకోనా .... వాలు కనులదాన నీ విలువ చెప్పుమైనా నా ప్రాణమిచ్చుకోనా నీ రూపుచూసి శిలనుయైతినే ఓ... ఒక మాటరాక ... ఒక మాటరాక మూగబోతినే

చరణం 2 :

దైవం నిన్నే మలచి తనలో తానే మురిసి ఒంపుసొంపు తీర్చు నేర్పు నీ సొంతమయ్యింది నాకంట నిల్చింది గడియ గడియ ఒడిని జరుగు రసవీణ నీ మేను మీటాలి నామేను వడివడిగా చేరుకో కౌగిలిలో కరిగిపో తనువు మాత్ర మిక్కడున్నది నిండు ప్రాణమివ్వమన్నది జక్కన్న కాలంనాటి చెక్కిన శిల్పం ఒకటి కన్నెగ వచ్చిందట చెలియా జక్కన్న కాలంనాటి చెక్కిన శిల్పం ఒకటి కన్నెగ వచ్చిందట చెలియా నీ సొగసు కేదిసాటి వాలు కనులదాన