చిత్రం: రజాకార్ (2024)
రచన: సుద్దాల అశోక్ తేజ
గానం: శంకర్ మహదేవన్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
పల్లవి :
చలోరే అన్నా..... చలోరే అన్నా.....
చలోరే అన్నా.... చలోరే అన్నా....
అరెరే గడ్డి పోసా అనుకో..
ప్రాణం గరికపోస అనుకో...
ప్రాణం గాజు పెంకు అనుకో
ప్రాణం ఉంటేంది పోతేంది...
అదిగో కొంగు సాపుకోని
గొంతుకు ఇనుప గొలుసుతోనీ
ముక్తిని అడుగుతోంది భూమి..
ప్రాణం ఇస్తేంది చస్తేంది.........
చరణం 1 :
లచ్చానూరేలు బతుకము తమ్మి
ఏ సచ్చి పోదాము నెత్తురు చిమ్మి
ఏ వస్తే రాని రా సావుల దొమ్మి
సస్తే పోయేది సంకెల తమ్మి
ఎనుకటికెవడో...
తన ఎన్నెముక....
నూరంచులకత్తులగా చేసినడంట యాది జెసుకో బిడ్డ
మన ఎముకలను, మన పేగులను
వెయ్యంచుల కత్తులు చేయమంటుంది
పురుడోసిన గడ్డ అరెరే గడ్డి పోసా అనుకో..
ప్రాణం గరికపోస అనుకో...
ప్రాణం గాజు పెంకు అనుకో
ప్రాణం ఉంటేంది పోతేంది...
అదిగో కొంగు సాపుకోని
గొంతుకు ఇనుప గొలుసుతోనీ
ముక్తిని అడుగుతోంది భూమి..
ప్రాణం ఇస్తేంది చస్తేంది.........
చరణం 2 :
నిలువునా చర్మం ఒలిచినా...
నిప్పుల కుప్పలో నడిపినా...
గేరిల్ల యుద్ధం ఆపక....
ఇక చావో రేవో చూస్కొ
బొందిల ప్రాణం ఉండగా
బొందల గడ్డలో కాల్చిన
వీరుల కపాల భస్మము
నీ నసుటన బొట్టుగా పెట్టుకో
తొడలల్లో బాకులతో
పొడిచేసి జలకల్ని
వదిలేస్తే కుడి మీసం
దూకుకుంటూ సచ్చిపో
కడదాక యుద్ధాన్ని నడిపించే జెండాని
నినుగన్న తల్లోలే
కనురెప్పలాగా కాసుకో అరెరే గడ్డి పోసా అనుకో..
ప్రాణం గరికపోస అనుకో...
ప్రాణం గాజు పెంకు అనుకో
ప్రాణం ఉంటేంది పోతేంది...
అదిగో కొంగు సాపుకోని
గొంతుకు ఇనుప గొలుసుతోనీ
ముక్తిని అడుగుతోంది భూమి..
ప్రాణం ఇస్తేంది చస్తేంది.........
చరణం 3 : చలోరే అన్నా ............ చలోరే అన్నా............ రక్కసి మూకల తరిమిన చక్రం రొమ్మున తురిమిన తిరంగా పతాక అందుకో వదలద్దు సచ్చేదాకా పరాయి తొత్తులు చీల్చిన శివాజీ నెత్తురు నీది రా శవాల కళ్ళము మీదుగా నడిచెల్తే విజయ డంక కొడవళ్ళు తిరిగేసి... నైజాము రజాకార్ల తలకాయలు తరిగేసి తన్నుకుంటూ వెళ్లిపో సర్దారు పట్టేలు పిడికిళ్ళు బిగిసేరా పిడుగోలే అడుగేసి జవాన్ అల్లే కదులు అరెరే గడ్డి పోసా అనుకో.. ప్రాణం గరికపోస అనుకో... ప్రాణం గాజు పెంకు అనుకో ప్రాణం ఉంటేంది పోతేంది... అదిగో కొంగు సాపుకోని గొంతుకు ఇనుప గొలుసుతోనీ ముక్తిని అడుగుతోంది భూమి.. ప్రాణం ఇస్తేంది చస్తేంది.........
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి