చిత్రం: రజాకార్ (2024)
రచన: కాసర్ల శ్యామ్
గానం: ఎమోహన భోగరాజు, భీమ్స్ సిసిరోలియో, స్పూర్తి జితేందర్, బృందా, అపర్ణ నందన్, రచిత, జయశ్రీ
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
పల్లవి:
భారతి భారతి ఉయ్యాలో బంగారు భారతి ఉయ్యాలో భారతి భారతి ఉయ్యాలో బంగారు భారతి ఉయ్యాలో సూడమ్మ మాగతి ఉయ్యాలో నీకు బతుకమ్మ హారతి ఉయ్యాలో సూడమ్మ మాగతి ఉయ్యాలో నీకు బతుకమ్మ హారతి ఉయ్యాలో ఈ గునుగు పూలతో ఉయ్యాలో మా గోడు సెప్పిన ఉయ్యాలో ఈ గునుగు పూలతో ఉయ్యాలో మా దేవుడు సెప్పిన ఉయ్యాలో ఈ కట్ల పూలతో ఉయ్యాలో మా గోస పరిసిన ఉయ్యాలో సీతజడ పూలతో ఉయ్యాలో మా రాత చదివినా ఉయ్యాలో మా కొంగు తడవంగ కన్లల్ల పెనుగంగా కంటికి మింటికి దార కటిందమ్మా భారతి భారతి ఉయ్యాలో బంగారు భారతి ఉయ్యాలో
చరణం 1: మా పల్లె తెల్లారే ఆ బుట్ల సప్పుళ్ళు మా గల్లీ బరువాయే గుర్రాల డొక్కల్ల ఒల్లంతా వాతలే లాటిలా దెబ్బలే తాకితే రక్తాలే తుపాకి డొక్కల్ల . ఆ కోడి పిల్లల ఊరికేటి జనాలు గద్ధోలె ఎత్తుకొని పోయేరు పానాలు రజాకార్లు చేసే నెత్తుటి తానాలు సింపినిస్తారాకులై పోయే మానాలు రికామంటూ ఉయ్యాలో ఆల మీద మన్ను బోయ్య ఉయ్యాలో రికామంటూ ఉయ్యాలో ఆల మీద మన్ను బోయ్య ఉయ్యాలో ఆ నిజమొన్ని తెచ్చి ఉయ్యాలో ఈడ ఎల్లాడ దియ్యాలే ఉయ్యాలో ఆ నిజమొన్ని తెచ్చి ఉయ్యాలో ఈడ ఎల్లాడ దియ్యాలే ఉయ్యాలో
చరణం 2: ఓ సంపుకుంట పోతే ఎన్నాళ్లిట్ల నోరు మూసుకొని ఉందాము ఇట్ల బిడ్డ గొడ్డు మెతుకు అడ్డమైన బతుకు కంప సెట్ల మీద పట్ట ఏసినట్టు గుంజు గుంజుతుంటే ఈడ ఉండుడెట్ల ఉడకాలే ఉడకాలే ఉయ్యాలో వాడు ఊరకాలే ఊరకాలే ఉయ్యాలో ఉడకాలే ఉడకాలే ఉయ్యాలో వాడు ఊరకాలే ఊరకాలే ఉయ్యాలో ఆ మరక కొడుకుల్ని ఉయ్యాలో ఊరు నడిమిట్ల నరకాలే ఉయ్యాలో ఆ మరక కొడుకుల్ని ఉయ్యాలో ఊరు నడిమిట్ల నరకాలే ఉయ్యాలో
చరణం 3: ఊళ్లకొత్తే మన వంక సూత్తే సేను కాడ కాపు కాసి వడిసెల్లా రాళ్లేసి పిట్టలెక్క వాని ఇగ్గి కొట్టాలె కంది పరక తోటి కములగొట్టాలె దొడ్డు దొడ్డు గుత్పలందుకొని వాని నడ్డి ఇరగ తంతే బొక్కలిరాగాలె మంద జూస్తే కొడుకు ఉచ్చా బోయ్యాలె బొంద దవ్వి ఉప్పు పాతారేయ్యాలే కారపు నీళ్లెత్తి కండ్లల్లనే జల్లి ఎండు మిరపకాయ ముంత పొగలు బెట్టి రోకలి బండేత్తి సాకలి బండ మీదా తలపండు పగలంగ ఇయ్యర మయ్యర దంచి రజాకారులను ఉయ్యాలో రవ్తులందుకొని ఉయ్యాలో రజాకారులను ఉయ్యాలో రవ్తులందుకొని ఉయ్యాలో తన్ని తన్ని తరిమెయ్యాలో అని ఇంట్ల పీనుగెల్ల ఉయ్యాలో తన్ని తన్ని తరిమెయ్యాలో అని ఇంట్ల పీనుగెల్ల ఉయ్యాలో