Brindavanam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Brindavanam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, మార్చి 2024, శుక్రవారం

Brindavanam : Oho Oho Bulli Pavurama Song Lyrics ( ఓహో ఓహో బుల్లి పావురమా)

చిత్రం : బృందావనం(1992 )

సంగీతం : మాధవపెద్ది సురేష్

గీతరచయిత : వెన్నెలకంటి

నేపధ్య గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి




పల్లవి :

అతడు: ఓహో ఓహో ఓహో బుల్లి పావురమా అయ్యో పాపం అంటే అది నేరమా అతివలకింత పంతమా... ఓ... అలకలు వారి సొంతమా ఆమె: ఓహో ఓహో ఓహో బుల్లి పావురమా పదే పదే అదే వెటకారమా అతివలు అంత సులభమా... ఓ... శ్రుతి ఇక మించనీకుమా... చరణం : 1

అ: మాటే వినకుంటే బైటే పడుకుంటే మంచే పడునంట మంచే చెబుతుంటా ఆ: అమ్మో మగవారు అన్నిటా తగువారు హద్దే మరిచేరు చాలిక ఆ జోరు అ: కోపం తీరాలంట తాపం తగ్గాలంట ఆ: తాపం తగ్గాలంటే చొరవే మానాలంట అ: మాటామంతీ మర్యాదే అపచారమా.. ఆమె: ఓహో ఓహో ఓహో బుల్లి పావురమా పదే పదే అదే వెటకారమా అతివలకింత పంతమా... ఓ... అలకలు వారి సొంతమా చరణం : 2

అ: నెయ్యం తియ్యంగా చెయ్యగ రమ్మంటా వియ్యాల పందిట్లో కయ్యం తగదంట ఆ: గిల్లికజ్జాలే చెల్లవు పొమ్మంటా అల్లరి చాలిస్తే ఎంతో మేలంట అ: వెండి వెన్నెలంతా ఎండగా మారిందంట ఆ: కొంటెకుర్రాళ్లకూ అదియే సరియంట అ: తగనీ తెగనీ తగువంతా తన నైజమా అతడు: ఓహో ఓహో ఓహో బుల్లి పావురమా అయ్యో పాపం అంటే అది నేరమా ఆమె:అతివలు అంత సులభమా... ఓ... శ్రుతి ఇక మించనీకుమా... అతడు: ఓహో ..

31, జులై 2021, శనివారం

Brindavanam : Aa Roju Na Rani Song Lyrics (ఆ రోజు నారాణి చిరునవ్వు చూసి )

చిత్రం : బృందావనం(1992 )

సంగీతం : మాధవపెద్ది సురేష్

గీతరచయిత : వెన్నెలకంటి

నేపధ్య గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి




పల్లవి :

ఆ రోజు నారాణి చిరునవ్వు చూసి అనుకున్నా ఏదో నవ్వని ఆ రోజు నారాణి చిరునవ్వు చూసి అనుకున్నా ఏదో నవ్వని ఈ రోజే తెలిసింది ఆ నవ్వున దాగుంది లవ్వని ఎద జివ్వున లాగింది లవ్వని ఆ రోజు నారాజు చిరునవ్వు  చూసి అనుకున్నా ఏదో నవ్వని ఆ రోజు నారాజు చిరునవ్వు  చూసి అనుకున్నా ఏదో నవ్వని ఈ రోజే నాకు తెలిసింది ఆ నవ్వున దాగుంది లవ్వని ఎద జివ్వున లాగింది లవ్వని

చరణం : 1

ఆ రోజు జాబిల్లీ పగలే వచ్చింది ఈరోజు జాజుల్లో సెగలే తెచ్చింది ఆ రోజు ఓ చూపూ వలలే వేసింది ఈ రోజు మాపుల్లో కలలే తోచింది కన్నులే వెన్నలాయే వన్నెలే వెన్నెలాయే ముద్దలా ముచ్చటాయే నిద్దరే పట్టదాయే ఈ రోజే నాకు తెలిసింది ఈ చిత్రాలే చేసింది లవ్వని మధుపత్రాలు రాసింది లవ్వనీ ఆ రోజు నారాజు చిరునవ్వు  చూసి అనుకున్నా ఏదో నవ్వని ఆ రోజు నారాణి చిరునవ్వు చూసి అనుకున్నా ఏదో నవ్వని ఈ రోజే తెలిసింది ఆ నవ్వున దాగుంది లవ్వని ఎద జివ్వున లాగింది లవ్వని

చరణం : 2

ఆ రోజు కలలోన తొణికే ఆ ప్రేమ ఈ రోజు ఇలలోన నిజమే చేద్దామా ఆరోజు మెరిసింది అందం చిరునామా ఈ రోజు కలిసింది జతగా ఈ భామ గుండెలో అల్లరాయే ఎండలే చల్లనాయే ఆశలే వెల్లువాయి ఊసులే చల్లిపోయే ఈ రోజే నాకు తెలిసింది రాగాలు రేపింది లవ్వనీ అనురాగాలు చూపింది నువ్వని ఆ రోజు నారాణి చిరునవ్వు చూసి అనుకున్నా ఏదో నవ్వని ఈ రోజే నాకు తెలిసింది ఆ నవ్వున దాగుంది లవ్వని ఎద జివ్వున లాగింది లవ్వని






Brindavanam : Madhurame Sudhaganam Song Lyrics (మధురమే సుధాగానం)

చిత్రం : బృందావనం(1992 )

సంగీతం : మాధవపెద్ది సురేష్

గీతరచయిత : వెన్నెలకంటి

నేపధ్య గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి



పల్లవి :

మధురమే సుధాగానం.. మనకిదే మరోప్రాణం  మదిలో మోహన గీతం.. మెదిలే తొలి సంగీతం  మధురమే సుధాగానం.. మనకిదే మరోప్రాణం  మదిలో మోహన గీతం.. మెదిలే తొలి సంగీతం 

చరణం : 1

చరణాలు ఎన్ని ఉన్నా పల్లవొకటే కదా.. కిరణాలు ఎన్ని ఉన్నా వెలుగొక్కటే కదా  శతకోటి భావాలను పలుకు ఎద మారున.. సరిగమలు మారుతున్నా మధురిమలు మారునా.. మధురమే సుధాగానం.. మనకిదే మరోప్రాణం  మదిలో మోహన గీతం.. మెదిలే తొలి సంగీతం 

చరణం : 2

వేవేల తారలున్నా నింగి ఒకటే కదా.. ఎన్నెన్ని దారులున్నా గమ్యమొకటే కదా.. ఎనలేని రాగాలకూ నాదమొకటే కదా.. అనుభూతులెన్ని ఉన్నా హౄదయమొకటే కదా.. మధురమే సుధాగానం.. మనకిదే మరోప్రాణం  మదిలో మోహన గీతం.. మెదిలే తొలి సంగీతం  మధురమే సుధాగానం.. మనకిదే మరోప్రాణం  మదిలో మోహన గీతం.. మెదిలే తొలి సంగీతం  మదిలో మోహన గీతం.. మెదిలే తొలి సంగీతం